Share News

టీ20ల్లో ఒక్కడే188

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:59 AM

టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన గ్రిస్‌ గేల్‌ రికార్డును దక్షిణాఫ్రికా బ్యాటర్‌ హువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్స్‌లతో 188 నాటౌట్‌)...

టీ20ల్లో ఒక్కడే188

  • ప్రిటోరియస్‌ అత్యధిక స్కోరు

  • గేల్‌ రికార్డు బద్దలు

బ్లూమ్‌ఫోంటీన్‌: టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన గ్రిస్‌ గేల్‌ రికార్డును దక్షిణాఫ్రికా బ్యాటర్‌ హువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్స్‌లతో 188 నాటౌట్‌) బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికా టీ20 చాలెంజ్‌లో నైట్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్‌ తరఫున ప్రిటోరియస్‌ ఈ ఫీట్‌ సాధించాడు. 2013 ఐపీఎల్‌లో పుణె వారియర్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున గేల్‌ (175 నాటౌట్‌) పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఆ రికార్డును ప్రిటోరియస్‌ ఇప్పుడు అధిగమించాడు. ప్రిటోరియస్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో టైటాన్స్‌ 20 ఓవర్లలో 267/3 స్కోరు చేయగా.. ఛేదనలో నైట్స్‌ 143 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్

Updated Date - Oct 04 , 2026 | 05:59 AM