4 బంతుల్లో 4 వికెట్లు
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:16 AM
రైల్వేస్ పేసర్ జంషేద్ ఆలం తన టీ20 క్రికెట్ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో...
పేసర్ జంషేద్ ఆలం రికార్డు
ఇండోర్: రైల్వేస్ పేసర్ జంషేద్ ఆలం తన టీ20 క్రికెట్ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో తన మొదటి ఓవర్‌లోనే ఆలం వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించిన మొదటి భారత బౌలర్ కాగా.. ఓవరాల్‌గా అభిమన్యు మిథున్, దర్శన్ నలకందే తర్వాత నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆలం తొమ్మిది బంతుల్లోనే ఐదు వికెట్లు తీశాడు. అయితే టీ20 అరంగేట్రంలోనే 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా పాక్ దేశవాళీ పేసర్ అఫాక్ అఫ్రీది (2024లో) ఉన్నాడు. ఇక ఆలం ప్రతిభతో రైల్వేస్ 29 రన్స్‌తో సౌరాష్ట్రపై నెగ్గింది. మొదట రైల్వేస్ 20 ఓవర్లలో 182/5 స్కోరు చేయగా.. సౌరాష్ట్ర 20 ఓవర్లలో 153/8 స్కోరుకే పరిమితమైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్