Share News

ఇరానీ కప్‌ విజేత రెస్టాఫ్‌ ఇండియా

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:57 AM

పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (6/33) నిప్పులు చెరగడంతో.. ఇరానీ కప్‌ను రెస్టాఫ్‌ ఇండియా సొంతం చేసుకొంది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో...

ఇరానీ కప్‌ విజేత రెస్టాఫ్‌ ఇండియా

  • జమ్మూ కశ్మీర్‌పై 167 పరుగులతో గెలుపు

  • ముకేశ్‌కు 6 వికెట్లు

శ్రీనగర్‌: పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (6/33) నిప్పులు చెరగడంతో.. ఇరానీ కప్‌ను రెస్టాఫ్‌ ఇండియా సొంతం చేసుకొంది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆటకు నాలుగోరోజైన ఆదివారం.. రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్‌ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెస్టాఫ్‌ ఇండియా 167 రన్స్‌ తేడాతో మరోరోజు ఆట మిగిలుండగానే గెలిచింది. ఓపెనర్లు శుభం (36), కమ్రన్‌ ఇక్బాల్‌ (32) టాప్‌ స్కోరర్లు. ఆకాశ్‌ దీప్‌ (3/25) రాణించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 306/8తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రెస్ట్‌ జట్టు 319 రన్స్‌కు ఆలౌటైంది. నిన్నటి స్కోరుకు రవిచంద్రన్‌ స్మరణ్‌ (135) తొమ్మిది పరుగులు జోడించాడు. సునీల్‌, సాహిల్‌ చెరో 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్‌ ఇండియా 237, జమ్మూ 278 రన్స్‌ చేశాయి.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 05:57 AM