ఎవరిదో ‘గులాబీ’?
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:27 AM
వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టు.. శుక్రవారం నుంచి జరిగే ఏకైక టెస్ట్ (డే/నైట్) టెస్ట్‌లో సత్తాచాటేందుకు సిద్ధమైంది. గత ఐదు టెస్ట్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు...
ఆసీ్‌స-భారత్ పింక్‌బాల్ టెస్ట్ నేటినుంచే..
ఉ. 10.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
పెర్త్: వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టు.. శుక్రవారం నుంచి జరిగే ఏకైక టెస్ట్ (డే/నైట్) టెస్ట్‌లో సత్తాచాటేందుకు సిద్ధమైంది. గత ఐదు టెస్ట్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను ఓడించిన హర్మన్‌సేన్.. విదేశాల్లో ఆడిన రెండు టెస్ట్‌లను డ్రా చేసుకొంది. కాగా, 2021లో ఆసీ్‌సతో పింక్ బాల్ మ్యాచ్‌ను డ్రాగా ముగించిన భారత్.. ఐదేళ్ల తర్వాత ఆడుతున్న డే/నైట్ టెస్ట్‌లో గెలిచి మల్టీఫార్మాట్ సిరీ్‌సను విజయంతో ముగించాలనుకొంటోంది. గత పర్యటనలో సెంచరీతో రాణించిన ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి అదే తరహా ప్రదర్శన చేయాలనుకొంటోంది. హర్మన్‌ప్రీత్, మంధాన, షెఫాలీ, జెమీమా, దీప్తి భారీ స్కోర్లు చేయాలి. తొలి టెస్ట్ ఆడుతున్న ప్రతీక రావల్‌పై అందరి దృష్టీ నెలకొనే అవకాశం ఉంది. రావల్‌తోపాటు వైష్ణవి, క్రాంతి గౌడ్, సయాలీ, కాష్వీ తొలి టెస్ట్ ఆడనున్నారు. మరోవైపు ఈ టెస్ట్‌లో గెలిచి కెప్టెన్ అలీసా హీలీకి ఘనంగా వీడ్కోలు చెప్పాలని ఆసీస్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News