ట్రోఫీ ఇద్దరిదీ
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:18 AM
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సమరంలో విజేతను తేల్చాల్సిన కీలక మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఐదో టీ20...
ఆఖరి మ్యాచ్ వరుణిడిదే
భారత్ 118/5
విండీస్తో ఐదో టీ20 రద్దు
2-2తో సిరీస్ సమం
బెంగళూరు: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సమరంలో విజేతను తేల్చాల్సిన కీలక మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఐదో టీ20 పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. శనివారం మ్యాచ్ నిర్ణీత సమయానికి భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా 9 ఓవర్ల చొప్పున కుదించి రాత్రి 9.15 గంటలకు మ్యాచ్ ఆరంభించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 7.4 ఓవర్ల సమయంలో 118/5 స్కోరు వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుపడింది. ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటికే చెరో రెండు విజయాలతో 2-2తో సమంగా ఉన్న భారత్-విండీస్ జట్ల్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. భారత్ ఆటలో ఇషాన్ కిషన్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30), నమన్ ధిర్ (6 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 24 నాటౌట్), శ్రేయాస్ (14 బంతుల్లో 2 ఫోర్లతో 22) చెలరేగారు. కీమో పాల్, స్ర్పింగర్కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా విండీస్ సారథి హోప్ నిలిచాడు.
ఇషాన్ జోరు: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్ ధనాధన్ ఆటతీరుతో సాగింది. 9 ఓవర్లే కావడంతో బ్యాటర్లు వీలైనంత వేగంగా పరుగులు సాధించడంపై దృష్టి పెట్టారు. అభిషేక్ (6) త్వరగానే అవుటైనా.. ఇషాన్ వచ్చీ రాగానే మోత మొదలెట్టాడు. రెండో ఓవర్లో 6,4,6,4తో 24 పరుగులు అందించాడు. ఆ వెంటనే ఇషాన్ అవుటయ్యాక శాంసన్ (16) 4,6తో జట్టు స్కోరు 17 బంతుల్లోనే 50కి చేరింది. అనంతరం శ్రేయాస్ వేగంగా ఆడే క్రమంలో అవుట్ కాగా.. నమన్ చివర్లో బ్యాట్ ఝుళిపించాడు. పాల్ ఓవర్లో 6,4,6తో 20 రన్స్ రాబట్టాడు. ఇక తిలక్ (7) అవుటైన వెంటనే వర్షం రావడంతో మరో 8 బంతులుండగానే ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్కు చేరారు.
స్కోరుబోర్డు
భారత్: శాంసన్ (బి) స్ర్పింగర్ 16, అభిషేక్ (సి) జోసెఫ్ (బి) పాల్ 6, ఇషాన్ (సి) పోవెల్ (బి) జోసెఫ్ 30, శ్రేయాస్ (సి) జోసెఫ్ (బి) పాల్ 22, తిలక్ (బి) స్ర్పింగర్ 7, నమన్ (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు: 13; మొత్తం: 7.4 ఓవర్లలో 118/5. వికెట్ల పతనం: 1-13, 2-45, 3-66, 4-88, 5-118. బౌలింగ్: పాల్ 2-0-34-2, షెఫర్డ్ 1-0-24-0, జోసెఫ్ 1-0-18-1, మోటీ 2-0-25-0, స్ర్పింగర్ 1.4-0-17-2.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా
యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!