Share News

6 పైనే డైలమా?

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:35 AM

శ్రీలంకతో గాలెలో జరిగే తొలి టెస్ట్‌కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే.. టీమిండియా ఇంకా తుది కూర్పుపైనే తర్జనభర్జనలు పడుతోంది. భారత జట్టు టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌...

6 పైనే  డైలమా?

  • జురెల్‌, సర్ఫరాజ్‌ మధ్య పోటీ

  • తుదిజట్టు కూర్పులో భారత్‌

గాలె: శ్రీలంకతో గాలెలో జరిగే తొలి టెస్ట్‌కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే.. టీమిండియా ఇంకా తుది కూర్పుపైనే తర్జనభర్జనలు పడుతోంది. భారత జట్టు టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ అవకాశాలు ఈ సిరీ్‌సపై ఎంతో ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా రావడంతో.. కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్‌, బౌలింగ్‌ విభాగంపై ఎక్కువగా సస్పెన్స్‌ నడుస్తోంది. అయితే, తుది జట్టు కూర్పులో జట్టును ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది నెం:6 స్థానం. వామప్‌ మ్యాచ్‌లో శతకంతో రాణించిన దేవ్‌దత్‌ పడిక్కల్‌.. గాయపడి సిరీ్‌సకు దూరమైన సాయి సుదర్శన్‌ ఆడే నెం:3 స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకొన్నాడు.

ఇద్దరి మధ్యనే పోటీ

ఇక, ఆరో నెంబర్‌ కోసం ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ మధ్య పోటీ నెలకొంది. వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ అయిన జురెల్‌ టెస్ట్‌ టీమ్‌లో రెగ్యులర్‌ ఆటగాడు కాగా.. సుదర్శన్‌కు బదులు సర్ఫరాజ్‌ టీమ్‌లోకి వచ్చాడు. రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ బాధ్యతలు చూస్తుండడంతో ప్రస్తుతం ధ్రువ్‌ టీమ్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. గడచిన 10 టెస్ట్‌ల్లో జురెల్‌ 34.14 సగటుతో 478 పరుగులు సాధించాడు. అయితే, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతడి బలహీనత మైన్‌సగా మారింది. లంకతో వామప్‌ మ్యాచ్‌లో కూడా ఆఫ్‌ స్పిన్నర్‌ రమేష్‌ మెండిస్‌ చేతిలో అవుటయ్యాడు. గాలె పిచ్‌ కూడా స్పిన్నర్లకు ఎక్కువగా సహకరించే అవకాశం ఉండడం ఇప్పుడు సెలెక్టర్లను డైలమాలోకి నెట్టింది. ఈ క్రమంలో గింగిరాలు తిరిగే పిచ్‌పై మెరుగ్గా ఆడగలిగే సర్ఫరాజ్‌ను తుదిజట్టులోకి తీసుకొంటే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే, సుదర్శన్‌ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్‌ను నెం:6లో ఎలా తీసుకొంటారని కొందరు మాజీలు ప్రశ్నిస్తున్నారు. పైగా జురెల్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కావడంతో.. అతడిపై వేటు వేయడానికి మేనేజ్‌మెంట్‌ సిద్ధంగా ఉండకపోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా సర్ఫరాజ్‌ దేశవాళీల్లో రాణిస్తున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో విఫలమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జురెల్‌ స్థాయి ఫీల్డింగ్‌ ప్రమాణాలు సర్ఫరాజ్‌కు లేవు. ఇక, పేస్‌ విభాగానికొస్తే సిరాజ్‌కు జోడీగా ప్రసిద్ధ్‌ కృష్ణను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే, మూడో పేసర్‌కు చోటిస్తారా? లేదా స్పిన్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తారా? అనేది స్పష్టం కావడం లేదు. కానీ, లెఫ్టామ్‌ పేసర్‌ కూడా ఎంతో ప్రభావం చూపగలడని మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ చెబుతున్నాడు.


సుందర్‌ అవుట్‌?

రెండో టెస్ట్‌కు మాత్రమే ఎంపికైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. తొడకండర గాయంతో బాధపడుతున్న సుందర్‌.. 23 నుంచి కొలంబోలో జరిగే రెండో మ్యాచ్‌ సమయానికి ఫుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడం కష్టమని సమాచారం.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 05:35 AM