మనోళ్లకు మరో చాన్స్
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:39 AM
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత జట్టు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో బరిలోకి దిగబోతోంది. వన్డే ఫార్మాట్‌లో జట్టును...
ఉ. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
శ్రేయాస్ కెప్టెన్సీలో సిరీస్‌పై దృష్టి
గిల్, రాహుల్ దూరం
నేడు కివీస్‌తో నాలుగో వన్డే
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత జట్టు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో బరిలోకి దిగబోతోంది. వన్డే ఫార్మాట్‌లో జట్టును నడిపించనుండడం అయ్యర్‌కిదే తొలిసారి. 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ పట్టేద్దామనుకున్నా.. వరుణుడు అడ్డుపడ్డాడు. అయితేనేం.. శుక్రవారం జరిగే నాలుగో వన్డే ద్వారా టీమిండియాకు మరో అవకాశం మిగిలే ఉంది. అందుకే ఇక అయ్యర్ ఆధ్వర్యంలో సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లు కూడా పలు మార్పులు చేయడం గమనార్హం. ఇక్కడి బే ఓవల్ మైదానంలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒకటి ఓడింది.
రుతురాజ్, ఇషాన్‌లకు చోటు: టెస్టు సిరీస్ సన్నాహకాల కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కీపర్ కేఎల్ రాహుల్ వన్డే జట్టును వీడారు. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌లకు వారి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ తుది జట్టులో ఆడనున్నారు. అయితే శ్రేయాస్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పు డు కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఉండడంతో ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే రోహిత్ కూడా 0, 23 పరుగులతో నిరాశపర్చాడు. దీంతో విరాట్‌పై అధిక భారం పడనుంది. మరోవైపు పేసర్ అన్షుల్ కాంబోజ్ కూడా టెస్టుల కోసం దూరం కావడంతో మహ్మద్ సిరాజ్‌కు ఈ వన్డేలో చోటు కల్పించవచ్చు. పిచ్‌ను బట్టి రెండో స్పిన్నర్ అవసరమనుకుంటే సిరాజ్‌ను పక్కనబెట్టి కులదీప్‌ను ఆడించే చాన్స్ లేకపోలేదు. పేసర్లు అర్ష్‌దీప్, బ్రార్, నబీ అంచనాలకు మించి రాణిస్తుండడం సానుకూలాంశం కానుంది.
సగం జట్టు మారింది..: సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలకు కివీస్ జట్టులో సగం మం ది దూరమయ్యారు. లాథమ్, మిచెల్, ఫిలిప్స్, స్మిత్, నికోల్స్ భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం సిద్ధం కానున్నారు. అలాగే చివరి రెండు మ్యాచ్‌ల కోసం పేసర్ బ్రెట్ రాండెల్‌ను రప్పించారు. పేసర్లు జేమిసన్, డఫీ ఎప్పటిలాగే భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టే అవకాశం ఉండగా, గాయం నుంచి కోలుకున్న పేసర్ మ్యాట్ హెన్రీ వారికి జత కలవవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, ఇషాన్, విరాట్, శ్రేయాస్ (కెప్టెన్), రుతురాజ్, నమన్, అక్షర్, నబీ, సిరాజ్/కుల్దీప్, బ్రార్, అర్ష్‌దీప్.
న్యూజిలాండ్: ఆలెన్, సైఫర్ట్, యంగ్, నిక్ కెల్లీ, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), ఫాక్స్‌క్రాఫ్ట్, హెన్రీ, జేమిసన్, ఫిషర్, డఫీ.
పిచ్, వాతావరణం
వారం రోజులుగా ఇక్కడ వర్షాలు లేకపోవడంతో ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు ఉండదని భావిస్తున్నారు. ఇక పిచ్ పేసర్లను అనుకూలించనుంది. ఇక్కడ జరిగిన చివరి నాలుగు డే/నైట్ మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్లకే విజయాలు దక్కాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..