ఒత్తిడంతా బౌలర్లపైనే
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:44 AM
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను భారత్ రికార్డు ఛేదనతో ఆరంభించినా.. ఓ విషయంలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ల జోరును అడ్డుకోవడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఇషాన్‌కు గాయం
బరిలోకి వైభవ్?
నేడు కివీ్‌సతో
భారత్ రెండో టీ20
మ. 12.30 నుంచి
సోనీ నెట్‌వర్క్‌లో..
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను భారత్ రికార్డు ఛేదనతో ఆరంభించినా.. ఓ విషయంలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ల జోరును అడ్డుకోవడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ కారణంగా ఆరంభం నుంచే కివీస్ కనీసం పది పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ముఖ్యంగా నాలుగేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన పేసర్ భువనేశ్వర్ నిరాశపర్చాడు. నోబ్స్, వైడ్లతో అతడి బౌలింగ్ గతి తప్పినట్టుగా కనిపించింది. ఇక అర్ష్‌దీప్, స్పిన్నర్ అక్షర్ పటేల్ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు.
దీంతో కివీస్ తమ సొంత గడ్డపై భారీ స్కోరందుకుంది. కానీ 226 పరుగుల ఛేదనను భారత బ్యాటర్ల ఎదురుదాడితో విజయవంతంగా పూర్తి చేసింది. మరోవైపు జట్టులోని ఆల్‌రౌండర్లు ఐదు, ఆరో బౌలర్ల స్థానాలకు న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే నితీశ్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 40 రన్స్ ఇవ్వగా, నమన్ బౌలింగ్‌కు దిగలేదు. శనివారం జరిగే రెండో టీ20కి కూడా అదే పిచ్ కావడంతో బౌలర్లు వ్యూహాలను మార్చుకుని బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుంది.
మరోవైపు భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ శాంసన్, శ్రేయాస్, నమన్‌ల పోరాటం ఆకట్టుకుంది. ఇషాన్ కిషన్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో 15 ఏళ్ల వైభవ్‌కు స్థానం దక్కే చాన్సుంది. ఇదిలావుండగా ఆతిథ్య కివీస్ కూడా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. స్పిన్నర్లు శాంట్నర్, బ్రేస్‌వెల్ మాత్రమే మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించారు. బ్యాటింగ్‌లో ఆలెన్, సైఫర్ట్, ఫిలిప్స్, మిచెల్, జాకబ్స్ ఫామ్‌లో ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, వైభవ్, శాంసన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, నమన్, నితీశ్, అక్షర్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, మయాంక్.
న్యూజిలాండ్: ఆలెన్, సైఫర్ట్, మిచెల్, ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), స్మిత్, హెన్రీ, మిల్నే, ఫెర్గూసన్.
ఇవి కూడా చదవండి: