సిరీస్ ఇక్కడే పట్టేస్తారా..
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:29 AM
తొలి వన్డేలో విజయంతో ఇంగ్లండ్ పర్యటనలో బోణీ కొట్టిన భారత్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈనేపథ్యంలో గురువారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని..
సా. 5.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
ఇంగ్లండ్‌తో భారత్ రెండో వన్డే నేడు
కార్డిఫ్: తొలి వన్డేలో విజయంతో ఇంగ్లండ్ పర్యటనలో బోణీ కొట్టిన భారత్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈనేపథ్యంలో గురువారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రెండు అంశాల్లో టీమిండియా ఆందోళన చెందుతోంది. ఒకటి కెప్టెన్ గిల్ ఫిట్‌నెస్ కాగా..రెండోది హిట్‌మ్యాన్ ఫామ్. మంగళవారం నాటి తొలి వన్డేలో 80 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద కాలి కండరాలు పట్టేయడంతో గిల్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అయితే కెప్టెన్ రెండో వన్డే బరిలో దిగుతాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన శుభ్‌మన్ అదే స్థాయిలో రాణించగలడా..అన్నది ప్రశ్న. ఇక రోహిత్‌నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఇ న్నింగ్స్ ఆశిస్తోంది. కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలిగాక అతడు దూకుడైన బ్యాటింగ్‌ను పక్కనబెట్టాడు. కానీ బ్యాటింగ్ విధానం మారిన తర్వాత రోహిత్ గణాంకాలు ఆశించిన మేర లేకపోవడం గమనార్హం. కాగా..సుదీర్ఘ కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన బుమ్రా లయ అందుకోవడంతోపాటు వికెట్లు పడగొట్టడం శుభసూచకం. ఇంకా..ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు సానుకూలాంశం. ఈ మ్యాచ్ జరిగే సోఫియా గార్డెన్స్ పిచ్ బౌన్స్‌కు అనుకూలిస్తుంది. దాంతో బ్రార్ స్థానంలో సీనియర్ అర్ష్‌దీ్‌పను తీసుకుంటారేమో చూడాలి. మరోవైపు టాపార్డర్ బ్యాటర్లు రాణించడం ద్వారా ఈ మ్యాచ్‌లో నెగ్గి..సిరీ్‌సలో నిలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
జట్లు (అంచనా): భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్, కేఎల్ రాహుల్, సుందర్, అక్షర్, దూబే, ్పసిద్ధ్, బుమ్రా, బ్రార్/అర్ష్‌దీప్.
ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్), బెతెల్, డకెట్, బట్లర్, కర్రాన్, రూట్, జాక్స్, ఆర్చర్, డాసన్, టంగ్, రషీద్.
10
కార్డి్‌ఫలో జరిగిన మొత్తం 14 వన్డేల్లో ఇంగ్లండ్ గెలిచిన మ్యాచ్‌లు
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News