ఫైనల్లో యువ భారత్
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:47 AM
కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (90 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 93)తోపాటు టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో.. భారత్ అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది...
ఆస్ట్రేలియా X ఇంగ్లండ్
తొలి వన్డే ( పెర్త్)
ఉ.9 గం. నుంచి యూరో స్పోర్ట్‌లో..
అదరగొట్టిన రాయ్‌చందానీ
వినీత్, ఆర్యవీర్ అర్ధ శతకాలు
సెమీ్‌సలో అఫ్ఘానిస్థాన్‌పై విజయం
టైటిల్ ఫైట్‌లో పాక్‌తో ఢీ
అండర్-19 ఆసియాకప్
అల్ అమీరత్ (ఒమన్): కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (90 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 93)తోపాటు టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో.. భారత్ అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్‌ను చిత్తు చేసింది. శనివారం జరిగే టైటిల్ ఫైట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పేసర్ ఇషాన్ సూద్ (3/43) దెబ్బ కు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 227/8 స్కోరు చేసింది. నోమన్ సలార్‌జాయ్ (51), ఫైజల్ రహీమ్ (51) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. అనంతరం ఛేదనలో భారత్ 36.5 ఓవర్లలో 230/2 స్కోరు చేసి గెలిచింది. భారత్‌కు ఓపెనర్లు రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ (51) తొలి వికెట్‌కు 117 పరుగులు చేశారు. అర్ధ శతకం పూర్తయిన తర్వాత నూర్ బౌలింగ్‌లో సెహ్వాగ్ క్యాచవుట్ అయ్యాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన వినీత్ (57 నాటౌట్)తో కలసి రాయ్‌చందానీ రెండో వికెట్‌కు 77 పరుగులతో గెలుపు దిశగా నడిపించాడు.
ఫైనల్లో పాకిస్థాన్
పేసర్ రిజ్వానుల్లా (5/30) విజృంభించడంతో.. మరో సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లా 31.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా (50), రకిబుల్ (26) టాప్ స్కోరర్లు. ఛేదనలో పాక్ 21.5 ఓవర్లలో 141/1 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్లు హయం ఖాన్ (69), ఉస్మాన్ (64 నాటౌట్) రాణించారు.
అఫ్ఘానిస్థాన్ అండర్-19: 50 ఓవర్లలో 227/8 (నోమన్ 51, ఫైజల్ రహీమ్ 51; ఇషాన్ 3/43),
భారత్ అండర్-19: 36.5 ఓవర్లలో 230/2 (రాయ్‌చందానీ 93, వినీత్ 57 నాటౌట్; సొహెయిల్ 1/56, నూర్ 1/58).
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..