వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక సవాల్
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:47 AM
భారత జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 22న మొదలయ్యే న్యూజిలాండ్ టూర్‌లో భాగంగా భారత్ ఐదేసి టీ20లు, వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది....
న్యూజిలాండ్ టూర్‌కు భారత్
నేడో, రేపో సెలెక్షన్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: భారత జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 22న మొదలయ్యే న్యూజిలాండ్ టూర్‌లో భాగంగా భారత్ ఐదేసి టీ20లు, వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. ఈ సిరీ్‌సకోసం మూడు భారత జట్ల ఎంపికకు తాత్కాలిక చైర్మన్ ప్రజ్ఞాన్ ఓఝా నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళ లేదా బుధవారాల్లో సమావేశం కానుంది. ముఖ్యంగా.. టెస్ట్, వన్డే జట్ల ఎంపిక ఒకింత సంక్లిష్టంగానే కనిపిస్తోంది. దాంతో వన్డేలతోపాటు టెస్ట్‌లు ఆడే ఏడు, ఎనిమిది మంది క్రికెటర్లకు ప్రాక్టీస్ ఎలా అన్నదే ప్రశ్న.
ఎందరు స్పిన్నర్లు ?: సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకోవడంతో సారాంశ్ జైన్‌ను పరిగణనలోకి తీసుకొనే చాన్సు లేదు. అయితే ఎంతమంది స్పిన్నర్లను తీసుకోవాలనేదే అసలు ప్రశ్న. జడేజా తుది జట్టులో ఉండడం ఖాయం. రెండో స్పిన్నర్‌గా మానవ్ సుతార్, కుల్దీ్‌ప యాదవ్‌లో ఒకరికి స్థానం దక్కొచ్చు. కానీ నలుగురు స్పిన్నర్లను మాత్రం కివీస్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశాలు ఏమ్రాతం లేవు. బ్యాటింగ్ కోణంలో చూస్తే కుల్దీప్‌పై వేటు పడొచ్చు. ఇరానీ కప్‌లో రాణించిన పేసర్లు, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్ రేసులోకొచ్చారు. ప్రసిద్ధ్, గుర్నూర్ ఎంపిక రేసులో ఉన్నా.. వారి తుది ఎంపిక ఫిట్‌నె్‌సపై ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..