Share News

కళ్లన్నీ వైభవ్‌పైనే..!

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:58 AM

వండర్‌ బాయ్‌ వైభవ్‌ సూర్యవంశీ రికార్డు డబుల్‌తో బలంగా పుంజుకొన్న భారత్‌-ఎ.. రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ ఫైనల్‌పై గురి పెట్టింది. గురువారం జరిగే సెమీస్‌లో శ్రీలంక-ఎతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది...

కళ్లన్నీ వైభవ్‌పైనే..!

నేటి సెమీ్‌సలో శ్రీలంక-ఎతో భారత్‌-ఎ ఢీ

  • రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌

  • మ. 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

దోహా: వండర్‌ బాయ్‌ వైభవ్‌ సూర్యవంశీ రికార్డు డబుల్‌తో బలంగా పుంజుకొన్న భారత్‌-ఎ.. రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ ఫైనల్‌పై గురి పెట్టింది. గురువారం జరిగే సెమీస్‌లో శ్రీలంక-ఎతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. పాకిస్థాన్‌ చేతిలో ఓటమితో ఒత్తిడిలోపడ్డ భారత్‌.. యూఏఈతో మ్యాచ్‌లో సూర్యవంశీ (53 బంతుల్లోనే 204 పరుగులు) వీరవిహారంతో నాకౌట్‌కు దూసుకెళ్లింది. అయితే, జట్టులో సమష్టి ప్రదర్శన లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మనోళ్ల బౌలింగ్‌ ఆందోళనకు గురి చేస్తోంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను 26 పరుగులకే ఆలౌట్‌ చేసినా.. పాక్‌, యూఏఈతో మ్యాచ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపించింది. పేసర్లు ప్రిన్స్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేక పోతున్నారు. ఇక, బ్యాటింగ్‌ విషయానికొస్తే కెప్టెన్‌ తిలక్‌ వర్మపైనే జట్టు ఎక్కువగా ఆధారపడింది. పాక్‌పై అతడు కష్టంగా సెంచరీ సాధించినా.. అది జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో తిలక్‌ మరింత మెరుగైన ఆటతో సహచరులకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయుష్‌ బదోని, హార్డ్‌ హిట్టర్‌ రింకూ సింగ్‌ ఇంకా తమదైన ముద్ర వేయలేక పోయారు. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక ఫుల్‌ జోష్ లో ఉంది. కెప్టెన్‌ పవన్‌ రత్నాయకే, నిషాన్‌ మధుష్క చక్కని ఫామ్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 03:58 AM