జురెల్, దేవ్‌దత్ అదుర్స్
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:34 AM
కెప్టెన్ ధ్రువ్ జురెల్ (99 బ్యాటింగ్), దేవ్‌దత్ పడిక్కళ్ (80) చెలరేగడంతో.. న్యూజిలాండ్ ‘ఎ’తో శనివారం మొదలైన...
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ 291/7
క్రైస్ట్‌చర్చ్: కెప్టెన్ ధ్రువ్ జురెల్ (99 బ్యాటింగ్), దేవ్‌దత్ పడిక్కళ్ (80) చెలరేగడంతో.. న్యూజిలాండ్ ‘ఎ’తో శనివారం మొదలైన రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 291/7 స్కోరుతో నిలిచింది. జైస్వాల్ తొలి ఓవర్‌లోనే డకౌట్ కాగా.. దేవ్‌దత్-సాయి సుదర్శన్ (41) జోడీ రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించింది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో జురెల్ అండగా నిలిచాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఆకాశ్ దీప్ (25 బ్యాటింగ్)తో ఎనిమిదో వికెట్‌కు జురెల్ అజేయంగా 69 రన్స్ జోడించాడు. ఫ్రేజర్ షీట్ 4 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!