భారత్ ‘ఎ’ జట్టులో అనుకూల్
ABN , Publish Date - May 22 , 2026 | 01:48 AM
శ్రీలంకలో ముక్కోణపు వన్డే టోర్నీలో తలపడే భారత ‘ఎ’ జట్టులో ఆల్‌రౌండర్ అనుకూల్ రాయ్‌ను చేర్చారు...
న్యూఢిల్లీ: శ్రీలంకలో ముక్కోణపు వన్డే టోర్నీలో తలపడే భారత ‘ఎ’ జట్టులో ఆల్‌రౌండర్ అనుకూల్ రాయ్‌ను చేర్చారు. టెస్ట్‌తోపాటు వన్డే జట్టులో హర్ష్‌దూబేకు స్థానం కల్పించిన నేపథ్యంలో..అతడికి బదులు ‘ఎ’ జట్టులో అనుకూల్‌కు చోటు దక్కింది. ఎడమచేతివాటం బ్యాటర్, లెఫ్టామ్ స్పిన్నర్ అయిన 27 ఏళ్ల రాయ్..దేశవాళీ పోటీలలో జార్ఖండ్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News