Share News

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌లో మార్పులు

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:25 AM

వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఫార్మాట్‌ల్లో ఐసీసీ మార్పులు చేసింది. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచక్‌పలో ఫైనల్‌కు ముందు 3 దశల ఫార్మాట్‌ను, 2028 పొట్టిక్‌పలో...

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌లో మార్పులు

  • వన్డే ఈవెంట్‌లో సూపర్‌-7

  • పొట్టిక్‌పలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు

  • ప్రకటించిన ఐసీసీ

ఎడిన్‌బర్గ్‌: వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఫార్మాట్‌ల్లో ఐసీసీ మార్పులు చేసింది. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచక్‌పలో ఫైనల్‌కు ముందు 3 దశల ఫార్మాట్‌ను, 2028 పొట్టిక్‌పలో సూపర్‌-8 నుంచి 10 జట్ల సూపర్‌-10కు విస్తరించింది. టీ20ప్రపంచకప్‌నకు సెమీ్‌సకు ముం దు రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లను ప్రవేశపెట్టింది.

వన్డే వరల్డ్‌కప్‌..: వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగే 50 ఓవర్ల వన్డే వరల్డ్‌క్‌పను 14 జట్లకు పెంచారు. గత టోర్నీలో 10 జట్లు మాత్రమే ఆడా యి. అయితే, గ్రూప్‌, సూపర్‌-7కు ముందు ‘సూపర్‌ సిరీస్‌’ రౌండ్‌ను అదనంగా ప్రవేశపెట్టారు.

రౌండ్‌-1: క్వాలిఫయర్స్‌లో 12 నుంచి 14 స్థానా ల్లో ఉన్న 3 జట్లు సూపర్‌ సిరీస్‌ రౌండ్‌లో తలపడతాయి. ఇందులో టాప్‌లో నిలిచిన జట్టు.. మిగతా 11 జట్లతో కలసి రౌండ్‌-2కు అర్హత సాధిస్తుంది.

రౌండ్‌-2: మొత్తం 12 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా వర్గీకరిస్తారు. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-3లో నిలిచిన జట్లతోపాటు అత్యుత్తమ ర్యాంక్‌లో ఉన్న జట్టు సూపర్‌-7కు అర్హత సాధిస్తుంది.

రౌండ్‌-3: రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో జరిగే సూ పర్‌-7లో అత్యుత్తమ ప్రదర్శనతో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి.

ఫైనల్‌: సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకొంటాయి.

  • 2027 టోర్నీలో 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. గత టోర్నీతో పోల్చితే 9 మ్యాచ్‌లు అదనం.

టీ20 వరల్డ్‌కప్‌..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇస్తున్న 2028 వరల్డ్‌క్‌పలో 20 జట్లు తలపడతాయి. తొలిదశలో నాలుగేసి జట్ల చొప్పున 5 గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-10కు అర్హత సాధిస్తాయి.

  • సూపర్‌-10లో ఐదేసి జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గత టోర్నీలో సూపర్‌-8లో టాప్‌లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించా యి. అయితే, కొత్త ఫార్మాట్‌లో ఐపీఎల్‌ తరహా ఎలిమినేటర్‌ను ప్రవేశపెట్టారు. గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన రెండు టీమ్‌లు నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లనున్నాయి. కానీ, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒక గ్రూప్‌లో రెండో స్థానంలో ఉన్న జట్లు మూడో స్థానంలో ఉన్న జట్టుతో ఎలిమినేటర్‌ ఆడనుంది. ఇందులో గెలిచిన రెండు టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:25 AM