హైదరాబాద్ పరాజయం
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:21 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌కు రెండో పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌కు రెండో పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో విదర్భ జట్టు మూడు వికెట్లతో హైదరాబాద్‌పై గెలుపొందింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 195/8 స్కోరు చేసిం ది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (49), హిమతేజ (41) రాణించారు. అమన్‌రావ్ (27), రాహుల్ బుద్ధి (27) మోస్తరుగా ఆడారు. యశ్ కదమ్, సౌరవ్ దూబే చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం విదర్భ 19.2 ఓవర్లలో 198/7 స్కోరు చేసి విజయం అందుకుంది. ఓపెనర్ అథర్వ టైడే (82) హాఫ్ సెంచరీతో మెరవగా, యశ్ కదమ్ (27) పర్లేదనిపించాడు. తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన హైదరాబాద్, గత పోరులో చత్తీస్‌గఢ్‌పై నెగ్గిన విషయం తెలిసిందే. కాగా ఇదే టోర్నీలో భాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో కేరళ జట్టుపై ఆంధ్ర విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!