హైదరాబాద్ బోణీ
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:15 AM
స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ (6/52) తిప్పేయడంతో.. రంజీ సీజన్‌ను హైదరాబాద్ ఘనవిజయంతో ఆరంభించింది. గ్రూప్-బిలో త్రిపురతో మ్యాచ్‌లో...
తిప్పేసిన తనయ్
ఇన్నింగ్స్ తేడాతో త్రిపుర చిత్తు
హైదరాబాద్: స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ (6/52) తిప్పేయడంతో.. రంజీ సీజన్‌ను హైదరాబాద్ ఘనవిజయంతో ఆరంభించింది. గ్రూప్-బిలో త్రిపురతో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో గెలిచింది. మరో రోజు ఆట మిగిలుండగానే నెగ్గిన హైదరాబాద్ బోనస్ సహా ఏడు పాయింట్లను తన ఖాతాలో వేసుకొంది. ఆటకు మూడో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 99/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన త్రిపుర 120 పరుగులకే కుప్పకూలింది. సేతు సర్కార్ (27) టాప్ స్కోరర్. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో త్రిపుర 134 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ 294 రన్స్ చేసింది. కాగా, ఇదే గ్రూప్‌లో కర్ణాటకతో రంజీలో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ఆఖరుకు కర్ణాటక 176/4 స్కోరు చేసింది. కరుణ్ నాయర్ (81), స్మరణ్ (21) క్రీజులో ఉన్నారు. సౌరభ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!
ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన