హైదరాబాద్ అదరహో
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:58 AM
ఓటమి ఖాయమనుకున్న దశలో హైదరాబాద్ అద్భుతమే చేసింది. 259 పరుగుల ఛేదనలో జట్టు ఓ స్థితిలో 220/9 స్కోరుతో నిలిచింది...
హైదరాబాద్ అదరహో
చత్తీస్‌గఢ్‌పై వికెట్ తేడాతో విజయం
సికింద్రాబాద్: ఓటమి ఖాయమనుకున్న దశలో హైదరాబాద్ అద్భుతమే చేసింది. 259 పరుగుల ఛేదనలో జట్టు ఓ స్థితిలో 220/9 స్కోరుతో నిలిచింది. అయినా పట్టు వదలకుండా దాదాపు 17 ఓవర్లపాటు అనికేత్ రెడ్డి (39 నాటౌట్), రక్షణ్ రెడ్డి (15 నాటౌట్) క్రీజులో నిలిచారు. దీంతో పంజాబ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ ఆఖరి రోజు హైదరాబాద్ 259/9 స్కోరు సాధించి వికెట్ తేడాతో నెగ్గింది. ఈ విజయంతో జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. అభిరత్ (68), వరుణ్ గౌడ్ (55) హాఫ్ సెంచరీలు సాధించారు. దేవ్ ఆదిత్యకు మూడు.. జయంత్, అజయ్, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో చత్తీస్‌గఢ్ 284, హైదరాబాద్ 280 పరుగులు చేయగా.. చత్తీస్‌గఢ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. మరోవైపు ఎలీట్ గ్రూప్ ‘బి’లో ఆంధ్ర-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..
పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్