Share News

హైదరాబాద్‌ ఉత్కంఠ విజయం

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:04 AM

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీలో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. సోమవారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో...

హైదరాబాద్‌ ఉత్కంఠ విజయం

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ

కోల్‌కతా: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీలో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. సోమవారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో చత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్‌ గెలిచింది. తొలుత చత్తీస్‌గఢ్‌ 19.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌ఆదిత్య సింగ్‌ (47), ఆయుష్‌ పాండే (37), ప్రతీక్‌ యాదవ్‌ (21) మాత్రమే రాణించారు. అజయ్‌ దేవగౌడ్‌ 4, కెప్టెన్‌ మిలింద్‌ 3, రక్షణ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 169/9 స్కోరు చేసి గట్టెక్కింది. హిమతేజ (37), అభిరథ్‌ (34), రాహుల్‌ (28) సత్తా చాటారు. చివర్లో తనయ్‌ త్యాగరాజన్‌ (19) ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. జయంత్‌ యాదవ్‌, విజయ్‌ యాదవ్‌, దేవ్‌ ఆదిత్య సింగ్‌ తలా రెండేసి వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 17 , 2026 | 04:04 AM