Share News

హైదరాబాద్‌ 275 ఆలౌట్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:45 AM

ఆంధ్ర బౌలింగ్‌ త్రయం త్రిపురాన విజయ్‌ (4/90), సౌరభ్‌ కుమార్‌ (3/75), లలిత్‌ మోహన్‌ (3/78) విజృంభించడంతో..

హైదరాబాద్‌ 275 ఆలౌట్‌

అభిరత్‌, రాహుల్‌ అర్ధ సెంచరీలు

ఆంధ్రతో రంజీ పోరు

మూలపాడు (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర బౌలింగ్‌ త్రయం త్రిపురాన విజయ్‌ (4/90), సౌరభ్‌ కుమార్‌ (3/75), లలిత్‌ మోహన్‌ (3/78) విజృంభించడంతో.. హైదరాబాద్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. గ్రూప్‌-బిలో ఆదివారం మొదలైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. అభిరత్‌ (67), రాహుల్‌ రాధేష్‌ (58 నాటౌట్‌) అర్ధ శతకాలు చేశారు. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (42), అభిరత్‌ తొలి వికెట్‌కు 109 రన్స్‌ జోడించారు. అయితే, టాప్‌-3 ఆటగాళ్లు తన్మయ్‌, అభిరత్‌, రాహుల్‌ సింగ్‌ (20)ను సౌరభ్‌ అవుట్‌ చేయడంతో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ కుదుపులకు గురైంది. ఒక ఎండ్‌లో రాధేష్‌ పోరాడినా, విజయ్‌, మోహన్‌.. మిడిల్‌, లోయర్డార్‌ పనిబట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆంధ్ర ఆట ఆఖరుకు 9/0 స్కోరు చేసింది. ఓపెనర్లు హేమంత్‌ (4), అభిషేక్‌ (5) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఆంధ్ర 266 రన్స్‌ దూరంలో ఉంది.

గిల్‌ ఢమాల్‌: టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఛత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. పంజాబ్‌ తరఫున నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ 5 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి అజయ్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అయితే, కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (106 బ్యాటింగ్‌) రాణించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్‌ 269/4 స్కోరు చేసింది. గ్రూప్‌-సిలో గుజరాత్‌తో పోరులో ప్రియాన్ష్‌ ఆర్య (199) త్రుటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకొన్నా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 381/4 స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి:

విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు

న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా

Updated Date - Oct 19 , 2026 | 05:45 AM