Share News

టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Jul 07 , 2026 | 09:34 PM

నాటింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే..
India vs England 3rd T20

స్పోర్ట్స్ డెస్క్: నాటింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. నాటింగ్‌హామ్ పిచ్‌పై మొదట్లో పేసర్లకు లభించే స్వింగ్‌ను అనుకూలంగా మార్చుకుని, ప్రత్యర్థిని తక్కువ పరుగులకే నియంత్రించాలనే వ్యూహంతో భారత కెప్టెన్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపాడు.


అలాగే ఇక్కడి పరిస్థితుల్లో ఛేజింగ్ సులువవుతుందనే నమ్మకం కూడా ఈ నిర్ణయానికి కారణమైంది. సిరీస్ పరంగా ఇరు జట్లకు అత్యంత కీలకమైన ఈ పోరులో ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఎంతవరకు కట్టడి చేస్తారో చూడాలి. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు మైదానానికి భారీగా తరలివచ్చారు. టీమిండియా తుది జట్టులో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్ నిలిచింది.


తుది జట్లు:

ఇంగ్లండ్:

ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

భారత్:

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి


ఇవి కూడా చదవండి:

45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!

Updated Date - Jul 07 , 2026 | 09:53 PM