Share News

దేవ్‌దత్‌ ‘డబుల్‌’ మిస్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:49 AM

న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ అద్భుతంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలిన వేళ..

దేవ్‌దత్‌ ‘డబుల్‌’ మిస్‌

న్యూజిలాండ్‌ ‘ఎ’తో తొలి అనధికార టెస్టు

199 రన్స్‌తో చెలరేగిన పడిక్కళ్‌

భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ 488/8

లింకన్‌: న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ అద్భుతంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలిన వేళ.. ప్రస్తుతం 284 పరుగుల ఆధిక్యంలో నిలవడం విశేషం. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (248 బంతుల్లో 23 ఫోర్లు, మూడు సిక్సర్లతో 199) వివాదాస్పద రీతిలో డబుల్‌ సెంచరీని కోల్పోగా.. సాయి సుదర్శన్‌ (91) సైతం ఆకట్టుకున్నాడు. దీంతో మూడో రోజు సోమవారం వెలుతురులేమితో ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ 488/8 పరుగుల భారీ స్కోరు సాధించింది. యష్‌ రాథోడ్‌ (66), నబీ (38) రాణించారు. క్రీజులో సుందర్‌ (51 బ్యాటింగ్‌)తో పాటు ఆకాశ్‌ దీప్‌ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. కివీస్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. అయితే చివరి రోజు వర్షం కురిసే అవకాశం ఉండడంతో మ్యాచ్‌ డ్రా కావచ్చని భావిస్తున్నారు.

అయ్యో.. పడిక్కళ్‌: 106/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ను దేవ్‌దత్‌, సాయి ఆదుకున్నారు. టెస్టు జట్టులో వన్‌డౌన్‌ బెర్త్‌ ఆశిస్తున్న వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత యష్‌తో కలిసి దేవ్‌దత్‌ ఐదో వికెట్‌కు 142 పరుగులు జత చేశాడు. అయితే 199 రన్స్‌ వద్ద దేవ్‌దత్‌ లెగ్‌ సైడ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా, బంతి ఎడ్జ్‌ తీసుకుందని భావించిన అంపైర్‌ క్యాచ్‌ అవుటిచ్చాడు. దీంతో షాక్‌కు గురైన దేవ్‌దత్‌ అసహనంతో క్రీజును వీడాల్సి వచ్చింది. అనధికార టెస్టులో డీఆర్‌ఎస్‌, స్నికోమీటర్‌ సౌకర్యం ఉండకపోవడంతో చేసేదేమీ లేకపోయింది.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 05:49 AM