మహిళల దేశవాళీ టీ20ల్లో ఢిల్లీ ప్రపంచ రికార్డు స్కోరు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:29 AM
మహిళల దేశవాళీ టీ20 మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ ప్రపంచ రికార్డు సృష్టించింది....
పుణె: మహిళల దేశవాళీ టీ20 మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ ప్రపంచ రికార్డు సృష్టించింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో భాగంగా గురువారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లకు 262 పరుగుల రికార్డు స్కోరు చేసింది. తనీషా సింగ్ (47 బంతుల్లో 119) వేగవంతమైన శతకం సాధించింది. ఛేదనలో హైదరాబాద్ 154/8 స్కోరు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ 108 పరుగుల తేడాతో విజయం సాధింది. కాగా, 2019-20 సీజన్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌పై గోవా చేసిన 252/2 రికార్డు స్కోరును ఇప్పుడు ఢిల్లీ అధిగమించింది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు