Share News

మమ్మల్ని ఆదుకోండి వెస్టిండీస్‌ కోచ్‌ డారెన్‌ సామీ

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:39 AM

బెంగళూరు: భారత పర్యటనలో వెస్టిండీస్‌ జట్టు అంచనాలకు మించే రాణించింది. ధనాధన్‌ పోరులో అయితే సిరీస్‌ను సమం...

మమ్మల్ని ఆదుకోండి వెస్టిండీస్‌ కోచ్‌ డారెన్‌ సామీ

బెంగళూరు: భారత పర్యటనలో వెస్టిండీస్‌ జట్టు అంచనాలకు మించే రాణించింది. ధనాధన్‌ పోరులో అయితే సిరీస్‌ను సమం చేసుకుంది. దీంతో ఈ ఆట తీరుతో తమ బోర్డు ఆర్థిక పరిస్థితిని మార్చుకోవాలని ఆ జట్టు కోచ్‌ డారెన్‌ సామీ భావిస్తున్నాడు. ‘మా బోర్డు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుతం మాకు అండగా నిలిచే ఆపన్న హస్తం అవసరం. వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌తో మా పోరాటాన్ని అందరూ చూశారు. ఈ ఆటతీరుతో మాకు స్పాన్సర్లు పెరుగుతారని ఆశిస్తున్నా. ఆర్థికంగా చేయూత దక్కితే అద్భుతాలు సృష్టించగలం. మమ్మల్ని ఆర్ధికంగా ఆదుకోండి’ అని సామీ భావోద్వేగంతో స్పందించాడు.

ఇవి కూడా చదవండి:

విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు

న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా

Updated Date - Oct 19 , 2026 | 05:39 AM