Share News

75 ఏళ్ల తర్వాత..

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:43 AM

అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే వెటరన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (206 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. 75 ఏళ్ల తర్వాత...

75 ఏళ్ల తర్వాత..

డబుల్‌ సెంచరీతో ఇర్విన్‌ రికార్డు

షార్జా: అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే వెటరన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (206 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. 75 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ సాధించిన మూడో పెద్ద వయస్సు (41 ఏళ్ల 82 రోజులు) బ్యాటర్‌గా నిలిచాడు. 42 ఏళ్ల వయస్సులో రొవాన్‌ (1951లో, దక్షిణాఫ్రికా) 236 పరుగులతో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత జాక్‌ హాబ్స్‌ (1924లో 211 రన్స్‌, 41 ఏళ్ల 195 రోజులు) నిలిచాడు. అటు ఇర్విన్‌ డబుల్‌, మధెవెరె (100 నాటౌట్‌) సెంచరీతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 523/5 రన్స్‌ చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 504, అఫ్ఘాన్‌ 514 పరుగులు చేశాయి.

ఇవి కూడా చదవండి:

దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన

ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్

Updated Date - Nov 10 , 2026 | 05:43 AM