‘చిన్నస్వామి’లో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:51 AM
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొన్న...
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఆరంభం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొన్న అనంతరం ఐపీఎల్ మ్యాచ్‌లను జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న చిన్నస్వామిలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 5 మ్యాచ్‌లు.. రెండో హోంగ్రౌండ్‌గా ఎంచుకొన్న రాయ్‌పూర్‌లో 2 మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది జూన్ 4న ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో ఈ స్టేడియంలో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ఆందోళన నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News