చిన్మయ్ @: 400
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:32 AM
రంజీ ట్రోఫీలో అతిపెద్ద సంచలనం నమోదైంది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (517 బంతుల్లో 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 నాటౌట్) నాగాలాండ్‌తో....
రంజీ ట్రోఫీలో మిజోరం బ్యాటర్ చరిత్ర
క్వాడ్రపుల్ సెంచరీతో అరుదైన ఘనత
బ్రాడ్‌మన్, లారా సరసన సుతార్
సోవిమ (నాగాలాండ్): రంజీ ట్రోఫీలో అతిపెద్ద సంచలనం నమోదైంది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (517 బంతుల్లో 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 నాటౌట్) నాగాలాండ్‌తో మ్యాచ్‌లో అజేయ క్వాడ్రపుల్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. దీంతో రంజీ ట్రోఫీ చరిత్రలో 400 పరుగుల మార్క్‌ను దాటిన రెండో క్రికెటర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. గతంలో 1948లో మహారాష్ట్ర ఆటగాడు బీబీ నింబాల్కర్ (443 నాటౌట్) రంజీల్లో కథియవాడ్ జట్టుపై క్వాడ్రపుల్ శతకం చేశాడు. 78 ఏళ్ల అనంతరం సుతార్ ఆ చారిత్రక ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ క్రమంలో రంజీల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా పృథ్వీ షా (2022లో అసోంపై 379 రన్స్) రికార్డును సుతార్ అధిగమించాడు. ఇక, నాగాలాండ్‌తో పోరులో చిన్మయ్ సూపర్ ఇన్నింగ్స్‌తో మిజోరం తొలి ఇన్నింగ్స్‌ను 581/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసేసరికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది.
లారా, బ్రాడ్‌మన్ సరసన సుతార్: ఈ భారీ ఇన్నింగ్స్‌తో చిన్మయ్ సుతార్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన దిగ్గజ బ్యాటర్లు డాన్ బ్రాడ్‌మన్, బ్రయాన్ లారా సరసన చేరాడు. లారా (501 నాటౌట్), బ్రాడ్‌మన్ (452 నాటౌట్), చిన్మయ్ సుతార్‌తో కలిసి ఓవరాల్‌గా ఎనిమిది మంది ఆటగాళ్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో క్వాడ్రపుల్ శతకం బాదిన జాబితాలో ఉన్నారు.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే