నాలుగేళ్ల తర్వాత.. భువీ రీఎంట్రీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:24 AM
ఐపీఎల్‌లో అదరగొట్టిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (36) నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం...
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అదరగొట్టిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (36) నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియాతోపాటు భారత్-ఎ జట్టును కూడా తాత్కాలిక చీఫ్ ప్రజ్ఞాన్ ఓఝా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. 2022 నవంబరులో న్యూజిలాండ్‌పై భువీ చివరిసారి ఆడాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో 7.94 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టిన భువీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ ఉన్నంత కాలం భువీని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, బుమ్రా గైర్హాజరీలో భువీ అనుభవం జట్టుకు అవసరమని ఓఝా అండ్ కోను సెంట్రల్ జోన్ సెలెక్టర్ రుద్ర ప్రతాప్ సింగ్ ఒప్పించినట్టు సమాచారం. గాయం నుంచి కోలుకొన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మళ్లీ జట్టులో చోటుదక్కగా.. బిష్ణోయ్‌పై వేటుపడింది. అఫ్ఘానిస్థాన్‌తో టీ20ల్లో వరుణ్ పక్కటెముకల నొప్పితో బాధపడడంతో.. ఆసియాడ్ జట్టు నుంచి తప్పించారు. ఇవి మినహా వెస్టిండీ్‌సతో ఆడుతున్న జట్టునే సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా, టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీ20ల్లో బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. పంత్ ఫిట్‌నె్‌సపై క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఈ నెల 22 నుంచి నవంబరు ఒకటో తేదీ వరకు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీ్‌సలు షెడ్యూల్ చేశారు. కాగా, ఈనెల 27 నుంచి కివీ్‌స-ఎతో భారత్-ఎ 3 మ్యాచ్‌లు ఆడనుంది.
టీ20 జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, నితీశ్ కుమార్, నమన్ ఽధిర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
భారత్-ఎ జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకిబ్ నబీ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, ముకేశ్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముకేశ్ కుమార్.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన