బీసీసీఐ.. ఎందుకీ వివక్ష?
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:40 AM
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్‌ను బీసీసీఐ ప్రత్యేకంగా ప్రశంసించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది...
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్‌ను బీసీసీఐ ప్రత్యేకంగా ప్రశంసించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. స్టార్ల వారసులను మాత్రమే గుర్తిస్తూ, సాధారణ ఆటగాళ్ల ప్రతిభను మాత్రం బీసీసీఐ విస్మరిస్తోందంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే.. వినూమన్కడ్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం చండీగఢ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్ అయిన ఆర్యవీర్ సెహ్వాగ్ (143 బంతుల్లో 173) భారీ సెంచరీ చేశాడు. దీంతో, ఆర్యవీర్ ప్రదర్శనను పొగుడుతూ అతడి ఇన్నింగ్స్ క్లిప్‌లను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కానీ, ఇదే టోర్నీలో అదే రోజు హరియాణాతో మ్యాచ్‌లో బిహార్ బ్యాటర్ అన్మోల్ కుమార్ (86 బంతుల్లో 184) భారీ శతకంతో జట్టును గెలిపించాడు. కానీ, అన్మోల్ ప్రదర్శన గురించి బీసీసీఐ ఖాతాలో ఎలాంటి పోస్ట్ లేదు. దీంతో బీసీసీఐ వివక్ష చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు
న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా