Share News

‘ఆరే’సిన హాజెల్‌వుడ్‌ సఫారీలకు ఝలక్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:10 AM

స్వదేశంలో గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆతిథ్య దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలి యా షాకిచ్చింది. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో..

‘ఆరే’సిన హాజెల్‌వుడ్‌ సఫారీలకు ఝలక్‌

ఆస్ట్రేలియాదే తొలి టెస్టు

డర్బన్‌: స్వదేశంలో గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆతిథ్య దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలి యా షాకిచ్చింది. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను 213 పరుగులతో చిత్తుచేసి ఆసీస్‌ 1-0 ఆధిక్యం అందుకుంది. 421 పరుగుల ఛేదనలో సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 206 రన్స్‌కే కుప్పకూలారు. మార్‌క్రమ్‌ (75) ఒంటరి పోరాటం చేశాడు. ఆరు వికెట్లతో విజృంభించిన హాజెల్‌వుడ్‌ (6/49) ధాటికి ఆసీస్‌ చేతులెత్తేసింది. కాగా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను 314/6 వద్ద డిక్లేర్‌ చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 390, దక్షిణాఫ్రికా 284 రన్స్‌ చేశాయి.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:11 AM