వరుణుడు కరుణిస్తేనే..
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:38 AM
ఆసియా క్రీడల క్రికెట్‌లో అడుగుపెట్టిన భారత పురుషుల జట్టుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మ్యాచ్ ప్రాక్టీసే లభించలేదు...
ఉ.10.30 నుంచి సోనీ లివ్‌లో..
భారత్ఠ్‌శ్రీలంక సెమీస్ నేడు
ఆసియాడ్ క్రికెట్
నిస్సిన్: ఆసియా క్రీడల క్రికెట్‌లో అడుగుపెట్టిన భారత పురుషుల జట్టుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మ్యాచ్ ప్రాక్టీసే లభించలేదు. వచ్చినప్పటి నుంచి వరుణుడే ప్రతాపం చూపిస్తున్నాడు. దరిమిలా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు రద్దుకాగా..అందులో ఐదు పోటీల్లో కనీసం టాస్ కూడా వేయలేదు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ కూడా ఉంది. గురువారం జరిగే సెమీ్‌సలో డిఫెండింగ్ చాంపియన్ భారత్..ద్వితీయ శ్రేణి శ్రీలంక జట్టుతో తలపడనుంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే..అత్యున్నత ర్యాంక్ దృష్ట్యా శ్రేయాస్ సేన ఫైనల్ చేరుతుంది. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఢీకొంటాయి.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు
‘జీ’ సుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు