అంగరంగ వైభవంగా అర్జున్ పెళ్లి
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:29 AM
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తన స్నేహితురాలు, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారి రవి ఘాయ్ మనుమరాలు...
ముంబై: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తన స్నేహితురాలు, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారి రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌ను అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ కల్యాణానికి పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వ్యాపారవేత్త ముఖే ష్ అంబానీ, నీతా అంబానీ, బాలీవుడ్ నటులు అమితాబ్-జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వెంకటేష్ ప్రసాద్, హర్షా భోగ్లే, అజిత్ అగర్కార్, ప్రజ్ఞాన్ ఓఝా, మహ్మద్ కైఫ్, పియూష్ చావ్లా, యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్, చాముండేశ్వర్‌నాథ్ తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News