అనికేత్ ‘పాంచ్’
ABN , Publish Date - Oct 12 , 2026 | 02:03 AM
స్పిన్నర్ అనికేత్ రెడ్డి (5/21) ఐదు వికెట్లతో చెలరేగడంతో హైదరాబాద్‌తో ఆదివారం ఇక్కడ ఆరంభమైన గ్రూప్ ‘బి’ రంజీ పోరు తొలి ఇన్నింగ్స్‌లో త్రిపుర 134 పరుగులకే కుప్పకూలింది.
త్రిపుర 134 ఆలౌట్ జూహైదరాబాద్‌తో రంజీ
హైదరాబాద్: స్పిన్నర్ అనికేత్ రెడ్డి (5/21) ఐదు వికెట్లతో చెలరేగడంతో హైదరాబాద్‌తో ఆదివారం ఇక్కడ ఆరంభమైన గ్రూప్ ‘బి’ రంజీ పోరు తొలి ఇన్నింగ్స్‌లో త్రిపుర 134 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 130 పరుగులకు 4 వికెట్లతో ఆడుతున్న త్రిపుర మరో 4 పరుగుల తేడాతో మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన త్రిపుర మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు బిక్రమ్ కుమార్ దాస్ (50), హృతురాజ్ రాయ్ (33) తొలి వికెట్‌కు 80 పరుగులతో శుభారంభం ఇచ్చారు. ఈ దశలో తొలుత మరో స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ (3/37)తోపాటు అనికేత్ ‘తిప్పేయ’డంతో త్రిపుర చకచకా వికెట్లు కోల్పోయింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన హైదరాబాద్ తొలిరోజు ఆఖరికి 121/4 చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (48 బ్యాటింగ్), అభిరథ్ రెడ్డి (32) మొదటి వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. తన్మయ్‌తోపాటు రుతిక్ (11) క్రీజులో ఉన్నాడు. విజయవాడలో ఆంధ్రతో మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 274 రన్స్‌కు ఆలౌటైంది. 22/4తో కష్టాల్లో పడగా.. కెప్టెన్ స్మరణ్ (126), శ్రీజిత్ (58) ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించడంతో కర్ణాటక గౌరవప్రద స్కోరు చేసింది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర 16/2 స్కోరు చేసింది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డకౌటయ్యాడు. తొలి రోజు ఆఖరికి ముంబై 249/5 స్కోరు చేసింది.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ ధనాధన్
కివీస్ జట్టులో రచిన్