అఫ్ఘాన్ క్లీన్‌స్వీప్
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:42 AM
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను అఫ్ఘానిస్థాన్ 3-0తోక్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరిదైన మూడో టీ20లో...
మూడో టీ20లో జింబాబ్వే ఓటమి
షార్జా: జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను అఫ్ఘానిస్థాన్ 3-0తోక్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరిదైన మూడో టీ20లో అఫ్ఘాన్ 7 వికెట్లతో గెలిచింది. ముందుగా జింబాబ్వే 14.3 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌటైంది. రియాన్ బర్ల్ (30) టాప్ స్కోరర్. స్పిన్నర్ నూర్ అహ్మద్‌కు 5 వికెట్లు దక్కాయి. ఛేదనలో అఫ్ఘాన్ 8.1 ఓవర్లలో 81/3 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ జద్రాన్ (25 నాటౌట్), సెడికుల్లా (20) రాణించారు. మసుకుకు 2 వికెట్లు దక్కాయి.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్