Share News

అఫ్ఘాన్‌ 211/4

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:25 AM

బంగ్లాదేశ్‌తో జరుగు తున్న ఏకైక టెస్టులో అఫ్ఘానిస్థాన్‌ జట్టు నిలకడగా ఆడుతోంది. రెండో రోజు శనివారం ఆట ముగిసేసరికి...

అఫ్ఘాన్‌ 211/4

బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు

అబుధాబి: బంగ్లాదేశ్‌తో జరుగు తున్న ఏకైక టెస్టులో అఫ్ఘానిస్థాన్‌ జట్టు నిలకడగా ఆడుతోంది. రెండో రోజు శనివారం ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 211/4 స్కోరు సాధిం చింది. రహ్మత్‌ షా (84 బ్యాటింగ్‌) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్‌ అబ్దుల్‌ మాలిక్‌ (62) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎబదోత్‌కు 2 వికెట్లు దక్కాయి. అఫ్ఘాన్‌ ఇంకా 135 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో రహ్మత్‌తో పాటు ఇక్రామ్‌ అలిఖిల్‌ (26) ఉన్నాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 11 , 2026 | 02:26 AM