Share News

చైనా మాస్టర్స్: టోర్నీ నుంచి లక్ష్యసేన్‌ ఔట్

ABN , Publish Date - Sep 02 , 2026 | 10:42 AM

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు.

చైనా మాస్టర్స్: టోర్నీ నుంచి లక్ష్యసేన్‌ ఔట్
Lakshya Sen

ఇంటర్నెట్ డెస్క్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14-21, 7-21 తేడాతో లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఓటమితో 2026లో విక్టోర్ లాయ్‌తో లక్ష్య సేన్ హెడ్-టు-హెడ్ రికార్డు 1-3కు పడిపోయింది. ఈ ఏడాది లక్ష్యపై లాయ్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం.


ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ నిరాశే..

ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన గారెట్‌ టాన్‌ చేతిలో ఓడిపోయాడు. చైనా మాస్టర్స్‌లో తొలుత లక్ష్యసేన్‌ ఫ్రాన్స్‌కు చెందిన అలెక్స్‌ లానియర్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఢిల్లీలో టైటిల్‌ సాధించిన అనంతరం లానియర్‌ టోర్నీ నుంచి వైదొలగడంతో.. లక్ష్యకు మరోసారి విక్టోర్‌ లాయ్‌తో తలపడే అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఫలితం లక్ష్యకు అనుకూలంగా రాలేదు.


కిదాంబి శ్రీకాంత్‌ దూకుడు

ఇదిలా ఉంటే.. మరో భారత స్టార్‌ కిదాంబి శ్రీకాంత్‌ మాత్రం చైనా మాస్టర్స్‌లో శుభారంభం చేశాడు. రౌండ్‌ ఆఫ్‌ 32లో చైనీస్‌ తైపీకి చెందిన చి యు-జెన్‌ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 16లోకి దూసుకెళ్లాడు. 2023 సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌లో శ్రీకాంత్‌ను తొలి రౌండ్‌లోనే ఓడించిన యు-జెన్‌పై ఈసారి భారత షట్లర్‌ పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌లోనూ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది. రౌండ్‌ ఆఫ్‌ 32లో థాయ్‌లాండ్‌కు చెందిన టోంకిడ్‌ సాహెంగ్‌-టోన్‌రగ్‌ సాహెంగ్‌ జోడీని 21-8, 21-9తో చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరింది.


ఇవి కూడా చదవండి:

అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్: ఆశ చావలేదు.. కృనాల్ పాండ్య పోస్ట్ వైరల్!

బాబర్ ఆజమ్‌కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!

Updated Date - Sep 02 , 2026 | 10:42 AM