Share News

ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె

ABN , Publish Date - Jun 27 , 2026 | 02:39 PM

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో సంచలనం నమోదైంది. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైనా కాబో వెర్డె ఫిఫా వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది.

ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె
Cabo Verde

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో సంచలనం నమోదైంది. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైనా కాబో వెర్డె (Cabo Verdy) ఫిఫా వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది. కేవలం 5.30 లక్షల జనాభా కలిగిన ఈ చిన్న దేశం ఇప్పుడు వరల్డ్ కప్‌ నాకౌట్‌కు చేరుకుని అందరిన ఆశ్చర్యానికి గురి చేసింది. 2010లో స్లోవేకియా తర్వాత ప్రపంచ కప్‌లో గ్రూప్ దశ నుంచి ముందంజ వేసిన తొలి అరంగేట్ర జట్టుగా కాబో వెర్డె నిలిచింది. అలాగే 2006లో ఘనా తర్వాత నాకౌట్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టు కూడా ఇదే కావడం విశేషం.


తొలిసారి ఫిఫా ప్రపంచ కప్‌ టోర్నీ బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. అయినా, రౌండ్ 32కు చేరుకొని వార్తల్లోకెక్కింది. గ్రూప్-హెచ్‌లో స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కాబో వెర్డె బరిలోకి దిగింది. స్పెయిన్ మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచింది. కాబో వెర్డె మాత్రం ఆడిన మూడు డ్రాలు చేసుకుని రెండో స్థానంతో నాకౌట్‌కి చేరింది. నాకౌట్‌లో జులై 3న బలమైన అర్జెంటీనాతో ఈ జట్టు తలపడనుంది.


మరోవైపు స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఉరుగ్వే ఓటమిపాలైంది. దీంతో సౌదీ అరేబియాతోపాటు ఉరుగ్వే ఇంటిముఖం పట్టాయి. అలానే ఫిఫా ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్‌ దూసుకెళ్తోంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఐ లో అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో నార్వేపై విజయం సాధించింది. ఇదే గ్రూప్‌ నుంచి సెనెగల్‌ 5-0 తేడాతో ఇరాక్‌ను ఓడించింది. దీంతో ఫ్రాన్స్‌, నార్వే, సెనెగల్‌ నాకౌట్‌కు చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే!

ఐర్లాండ్ చేతిలో ఓటమిపై స్పందించిన అభిషేక్ శర్మ

Updated Date - Jun 27 , 2026 | 02:48 PM