Share News

సాంబా జట్టుదే హవా

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:02 AM

చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌ ముందు భారత్‌ నిలవలేక పోయింది. ఆట ఆరంభమైన తొలి 25 నిమిషాలు...

సాంబా జట్టుదే హవా

  • 0-4తో భారత్‌ ఓటమి

  • స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

కోల్‌కతా: చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌ ముందు భారత్‌ నిలవలేక పోయింది. ఆట ఆరంభమైన తొలి 25 నిమిషాలు భారత్‌ కొంత దీటుగా పోరాడినా.. ఆ తర్వాత పూర్తిగా సాంబా టీమ్‌ హవానే సాగింది. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 0-4తో బ్రెజిల్‌ చేతిలో పరాజయం పాలైంది. శామ్యూల్‌ లీనో (58వ, 90+5వ నిమిషం) డబుల్‌ ధమాకా సృష్టించగా.. ఎస్టివో విలియన్‌ (28వ), పెడ్రో (42వ) చెరో గోల్‌ చేశారు. గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ తప్పిదాలు చేయకుండా ఉండి ఉంటే.. గోల్స్‌ సంఖ్య మరో విధంగా ఉండేది. ఫస్టాఫ్‌ ఆరంభంలో భారత ఆటగాళ్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కానీ, 28వ నిమిషంలో ఇన్నర్‌ బాక్స్‌లో పాస్‌ను అందుకొన్న విలియన్‌ నేరుగా కొట్టిన కిక్‌.. గుర్‌ప్రీత్‌ చేతిని తాకుతూ గోల్‌లో పడింది. ఇక, మరో మూడు నిమిషాల్లో తొలి అర్ధ భాగం ముగుస్తుందనగా ఎస్టివో క్రాస్‌ను అందుకొన్న పెడ్రో.. పవర్‌ ఫుల్‌ కిక్‌తో బంతిని గోల్‌లోకి పంపి బ్రెజిల్‌ను 2-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. ఇక, రెండో అర్ధ భాగంలో మన్‌వీర్‌.. బ్రెజిల్‌ డిఫెన్స్‌ ఛేదించుకుంటూ పెనాల్టీ ఏరియాలోకి చొచ్చుకెళ్లి గోల్‌ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, సాంబా కీపర్‌ మోరిస్కో దాన్ని అడ్డుకొన్నాడు. అనంతరం 58వ నిమిషంలో భారత ప్లేయర్‌ బిజోయ్‌ తప్పిదంతో బంతిని దొరకబుచ్చుకొన్న శామ్యూల్‌ లినో.. గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌లోకి కొట్టాడు. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్‌లో లినో మరో గోల్‌తో బ్రెజిల్‌ ఆధిక్యాన్ని మరింతగా పెంచాడు.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్

Updated Date - Oct 04 , 2026 | 06:02 AM