Bangladesh Bans IPL Broadcasts: బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:23 AM
పీఎల్ నుంచి తమ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తప్పించడంతో.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కారాలు మిరియాలు నూరుతోంది. అందుకు నిరసనగా తమ దేశంలో...
ముస్తాఫిజుర్‌ను తప్పించడంపై నిరసన
ఢాకా: ఐపీఎల్ నుంచి తమ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తప్పించడంతో.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కారాలు మిరియాలు నూరుతోంది. అందుకు నిరసనగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా కొనుగోలు చేసింది. అయితే, బంగ్లాలో హిందువులపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తున్న పలు హిందూ సంఘాలు.. ఆ దేశ ఆటగాళ్లను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చాయి. దీంతో బీసీసీఐ.. రెహ్మాన్‌ను విడుదల చేయాలని కోల్‌కతా ఫ్రాంచైజీని ఆదేశించింది. అయితే, సహేతుకమైన కారణం చెప్పకుండా తమ ఆటగాడిపై వేటువేయడాన్ని బంగ్లా తప్పుబడుతోంది. అందుకు ప్రతిచర్యగా ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారత గడ్డపై టీ20 వరల్డ్‌కప్ ఆడబోమని, తమ మ్యాచ్‌ల్ని మరోచోటికి తరలించాలని ఐసీసీకి బంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే.
నష్టమేమీ లేదు
బంగ్లా చిందులు తొక్కుతున్నా.. బీసీసీఐ మాత్రం పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలు ఆపితే భారత క్రికెట్‌కు, ఐపీఎల్‌కు నష్టం లేదని, తాజా పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం కూడా ఏమీ లేదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి స్పందన వస్తుందని ముందుగానే ఊహించామని చెప్పారు. భారత నిర్ణయాల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి