Share News

పేస్‌, ఉష.. తర్వాత సురేఖనే

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:50 AM

భారత్‌ నుంచి ఆసియా క్రీడల్లో అత్యధిక స్వర్ణాలు సాధించిన జాబితాలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో...

పేస్‌, ఉష.. తర్వాత సురేఖనే

భారత్‌ నుంచి ఆసియా క్రీడల్లో అత్యధిక స్వర్ణాలు సాధించిన జాబితాలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ ఐదు స్వర్ణాలతో తొలి స్థానంలో నిలవగా, స్ర్పింట్‌ దిగ్గజం పీటీ ఉషతో కలిసి సురేఖ నాలుగు పసిడి పతకాలతో ద్వితీయ స్థానం పంచుకుంది. మొత్తంగా సురేఖ ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో ఆరు మెడల్స్‌ కొల్లగొట్టింది. తాజాగా సాధించిన టీమ్‌ ఈవెంట్‌ స్వర్ణంతో ఆమె అంతర్జాతీయ పతకాల సంఖ్య 94కి చేరుకోవడం విశేషం. 2014 ఆసియా క్రీడల్లో మహిళల టీమ్‌ కాంస్యం, 2018 ఆసియా క్రీడల్లో మహిళల టీమ్‌ రజతం, 2022లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌, టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలు, తాజాగా టీమ్‌ ఈవెంట్‌లో పసిడితో మెరిసింది. వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొని, పతకాలు సాధించిన ఏకైక భారత ఆర్చర్‌ సురేఖనే కావడం విశేషం.

ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

Updated Date - Oct 01 , 2026 | 05:50 AM