Share News

ఆస్తులు అమ్మి..

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:54 AM

ఆసియా క్రీడల్లో కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో స్వర్ణం కొల్లగొట్టిన తిరుమూరు గణేష్‌ మణిరత్నం స్వస్థలం తిరుపతి జిల్లా నాయుడుపేట. నాన్న హరిప్రసాదే గణేష్‌ తొలి కోచ్‌....

ఆస్తులు అమ్మి..

ఆసియా క్రీడల్లో కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో స్వర్ణం కొల్లగొట్టిన తిరుమూరు గణేష్‌ మణిరత్నం స్వస్థలం తిరుపతి జిల్లా నాయుడుపేట. నాన్న హరిప్రసాదే గణేష్‌ తొలి కోచ్‌. టోల్‌ప్లాజాలో సూపర్‌వైజర్‌గా పని చేసిన హరిప్రసాద్‌ కొడుకు ఆసక్తిని గమనించి అతడిని పెద్ద క్రీడాకారుడిని చేయాలని ఉద్యోగానికి స్వస్తి చెప్పి, కోచ్‌గా మారాడు. తొలుత రికర్వ్‌ ఆర్చర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన గణేష్‌ ఆతర్వాత కాంపౌండ్‌ ఆర్చర్‌గా మారాడు. ఆర్థిక సమస్యలతో గణేష్‌ శిక్షణ నిలిచిపోవడం ఇష్టం లేక తమకున్న కొద్దిపాటి ఆస్తులను విక్రయించారు. విశాఖలో శిక్షణ అనంతరం, భీమవరంలో ప్రముఖ కోచ్‌ కమల్‌ కిషోర్‌ గురించి తెలిసి గణేష్‌ను ఆయన అకాడమీలో చేర్పించారు. వరల్డ్‌కప్‌, ఆసియాక్‌పతో పాటు ఇప్పటివరకు దాదాపు 11 అంతర్జాతీయ పతకాలు సాధించిన గణే్‌షకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించలేదు. అయితే ఒలింపిక్స్‌ స్థాయికి చేరుకోవాలంటే ప్రభుత్వం నుంచి మరింత తోడ్పాటు కావాలని గణేష్‌ తెలిపాడు.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

Updated Date - Oct 01 , 2026 | 02:54 AM