Share News

జిమ్‌లో ఊహించని విషాదం.. ఊపిరి బిగబట్టి యువకుడి మృతి..

ABN , Publish Date - May 23 , 2026 | 07:58 PM

ఓ యువకుడు జిమ్‌లో ఊపిరి బిగబట్టి ప్రాణాలు కోల్పోయాడు. రమేష్ తివారీ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు.

జిమ్‌లో ఊహించని విషాదం.. ఊపిరి బిగబట్టి యువకుడి మృతి..
gym viral video

ఇంటర్‌నెట్ డెస్క్: జిమ్‌లలో ప్రమాదాల కారణంగా లేదా గుండెపోట్ల కారణంగా ప్రాణాలు పోవటం సర్వ సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జిమ్‌‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ యువకుడు జిమ్‌లో ఊపిరి బిగబట్టి ప్రాణాలు కోల్పోయాడు. రమేష్ తివారీ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు. ‘హార్ట్ బ్రేకింగ్ వీడియో.. వీడియో చిత్రీకరిస్తుండగా యువకుడు మరణించాడు’ అని రాసుకొచ్చాడు.


రమేష్ తివారీ షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు జిమ్‌లో వీడియో కోసం ఫోజులు ఇవ్వటం మొదలెట్టాడు. మొదట కుడి చేతి బైసెప్ చూపించాడు. ఆ తర్వాత బాడీ బిల్డర్‌లాగా మోస్ట్ మస్క్యులర్ ఫోజు ఇచ్చాడు. ఆ ఫోజ్ కోసం ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ యువకుడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘గుండె సమస్యలు ఉన్న వాళ్లు జిమ్‌లో జాగ్రత్తగా ఉండాలి’..‘ఈ వీడియో చూడగానే భయం వేసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

Updated Date - May 23 , 2026 | 08:03 PM