Share News

తలలో కత్తి దిగినా ఫోన్ చూస్తున్న యువకుడు.. షాకింగ్ వీడియో..

ABN , Publish Date - May 04 , 2026 | 03:46 PM

ఆర్థిక రాజధాని ముంబైలోని సియాన్ ఆసుపత్రి సమీపంలో ఓ యువకుడిపై భయంకరమైన దాడి జరిగింది. అతనిపై ప్రత్యర్థి పెద్ద కత్తితో దాడి చేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణలో బాధితుడి తల ఎడమ వైపున ఆ కత్తి దిగింది.

తలలో కత్తి దిగినా ఫోన్ చూస్తున్న యువకుడు.. షాకింగ్ వీడియో..
Mumbai Viral Video

మహారాష్ట్ర: ముంబైలో ఓ భయానక ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తలలో పెద్ద కత్తి దిగినా ఓ యువకుడు ప్రశాంతంగా ఆసుపత్రి వద్దకు వచ్చిన దృశ్యాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. అంత పెద్ద దాడి జరిగినా అతను ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పైగా యువకుడు ఫోన్ చూస్తూ అక్కడ తిరుగుతుండడం పలువురిని విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.


ఆర్థిక రాజధాని ముంబైలోని సియాన్ ఆసుపత్రి సమీపంలో ఓ యువకుడిపై భయంకరమైన దాడి జరిగింది. అతనిపై ప్రత్యర్థి పెద్ద కత్తితో దాడి చేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణలో బాధితుడి తల ఎడమ వైపున ఆ కత్తి దిగింది. తీవ్ర రక్తస్రావంతో అతని చొక్కా దాదాపు తడిసిపోయింది. అనంతరం ప్రత్యర్థి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడు ఎవరి సహాయం లేకుండా స్వయంగా నడుచుకుంటూ సియాన్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. ఆసుపత్రి ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. అలాగే చేతిలో ఫోన్ పట్టుకుని చూస్తున్న దృశ్యాలు ఆసుపత్రి వద్దకు వచ్చిన వారిని, అలాగే నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేశాయి.


ఆసుపత్రి వద్ద యువకుడి వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌ అయ్యింది. ఇంత పెద్ద గాయమైనా అతను ఎలా స్పృహలో ఉండగలిగాడని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు పోలీసులు దాడి జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, ముంబైలో ఇటీవలి కాలంలో చిన్నచిన్న వివాదాలకే ఇలాంటి హింసాత్మక దాడులు పెరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

భారతీయుల పేరు పెట్టుకుంటే ఇలా జరుగుతుందా! శ్వేతజాతీయుడి పోస్టు వైరల్

ఏంటీ.. ఇరాన్‌ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదా! వీడియో వైరల్

Updated Date - May 04 , 2026 | 04:43 PM