రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన మూగజీవి.. ప్రాణం కాపాడిన లోకో పైలట్
ABN , Publish Date - May 03 , 2026 | 05:17 PM
ఇటీవలి కాలంలో రైల్వే ట్రాక్‌లను దాటుతున్న సమయంలో నిత్యం వందలాది మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. లోకో పైలట్‌లు ఎంతగా ప్రయత్నించినా, రైళ్లను క్షణాల వ్యవధిలో ఆపడం సాధ్యం కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో రైల్వే ట్రాక్‌లను దాటుతున్న సమయంలో నిత్యం వందలాది మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. లోకో పైలట్‌లు ఎంతగా ప్రయత్నించినా, రైళ్లను క్షణాల వ్యవధిలో ఆపడం సాధ్యం కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, కొన్నిసార్లు లోకో పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని కాపాడుతున్న సంఘటనలూ ఉన్నాయి. తాజాగా.. అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, లోకో పైలట్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో రైల్వే ట్రాక్‌పైకి ఓ గేదె వచ్చింది. అది గమనించిన లోకో పైలట్ ఎన్నిసార్లు హారన్ కొట్టినా ట్రాక్‌పై ఉన్న గేదె అక్కడి నుంచి కదలలేదు. ముందు జాగ్రత్తగా రైలు వేగాన్ని తగ్గించి రైలును నిలిపివేశాడు లోకో పైలట్. కిందకు దిగి ఆ గెదెను పట్టాల నుంచి పక్కకు పంపించాడు. ఇంకా ఏమైనా గెదెలు ఇతర జీవాలు రైలు ట్రాక్‌పై ఉన్నాయా అని పరిక్షించి ఏవీలేవని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ రైలు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లోకో పైలట్ చూపించిన మానవత్వం, మూగజీవుల పట్ల ఆయనకున్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు లోకో పైలట్‌ను ‘నిజమైన హీరో అంటే నువ్వే బ్రదర్’ అని పొగిడేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..