Share News

ఏంటీ.. ఇరాన్‌ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదా! వీడియో వైరల్

ABN , Publish Date - May 03 , 2026 | 09:40 PM

టెహ్రాన్‌లో ప్రస్తుతం జనజీవనం ఎలా ఉందో చెప్పే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఏంటీ.. ఇరాన్‌ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదా! వీడియో వైరల్
Life in Tehran

ఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జీవనం ఎలా ఉందో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. అక్కడి సీన్స్ చూసి కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు హర్షం వ్యక్తం చేశారు. యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పడాలని అధిక శాతం మంది ఆకాంక్షించారు.

ఎస్టెల్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. నగర వీధుల్లో డ్రైవింగ్ చేస్తూ ఎస్టెల్ ఈ వీడియోను రికార్డు చేశారు. యుద్ధ వాతావరణం కారణంగా సైరెన్లు, విధ్వంసం కనిపించాల్సిన చోట ప్రశాంతమైన పరిస్థితులు నెలకొన్న వైనం ఎస్టెల్‌ను ఆశ్చర్యపరిచింది. అక్కడి ప్రజలు యథావిధిగా తమ దైనందిన జీవితంలో మునిగిపోయారు. ఆమె వీధిలో ఒక ఫుడ్ కోర్టు వద్ద ఆగి స్థానిక ఫుడ్స్‌ను ఎంజాయ్ చేశారు. మరో ఫుడ్ స్టాల్‌లో కొరియన్ ఫుడ్‌ను ఆరగించారు. రోజంతా అక్కడ ఆమెకు ప్రశాంత వాతావరణమే కనిపించింది. సాయంత్రం వేళ ఆమె ఒక విలాసవంతమైన హోటల్‌లో దిగారు. అక్కడి వాతావరణం కూడా ప్రశాంతంగానే కనిపించింది. జనాలు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. మరికొందరు రెస్టు తీసుకుంటూ కనిపించారు. జనాల ముఖాల్లో ఎలాంటి ఆందోళన కనిపించలేదని ఆమె అన్నారు.


ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. అక్కడి జీవనం ప్రశాంతంగా సాగిపోతుండటం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. మరికొందరేమో అభినందనలు కూడా తెలియజేశారు. యుద్ధ విరమణకు ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా సంశయం వ్యక్తం చేయడం, బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుల పేరు పెట్టుకుంటే ఇలా జరుగుతుందా! శ్వేతజాతీయుడి పోస్టు వైరల్

రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన మూగజీవి.. ప్రాణం కాపాడిన లోకో పైలట్

Updated Date - May 03 , 2026 | 10:19 PM