బెడిసి కొట్టిన స్టంట్ షో.. యువకుడి ప్రాణం పోయింది..
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:36 PM
అగ్నిపర్వతం దగ్గర అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. స్టంట్లు చేస్తుండగా పట్టుతప్పి ఆ యువకుడు అగ్నిపర్వతంలో పడిపోయాడు. తీవ్రగాయాల పాలై ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: అగ్నిపర్వతం దగ్గర అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. స్టంట్లు చేస్తుండగా పట్టుతప్పి ఆ యువకుడు అగ్నిపర్వతంలో పడిపోయాడు. తీవ్రగాయాల పాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన యెమన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల మేరకు.. దక్షిణ యెమన్‌లోని దమత్ జిల్లాలో హరధత్ దమత్ అనే నిద్రాణమైన అగ్నిపర్వత ఉంది. ఈ అగ్నిపర్వత ముఖద్వారం దాదాపు 120 మీటర్ల లోతు ఉంటుంది. దీని అడుగుభాగంలో విపరీతమైన వేడి, విషవాయువులు ఉన్నాయి.
పట్టు తప్పి.. ప్రాణం పోయి..
యెమన్ స్పైడర్ మ్యాన్‌గా పిలుచుకునే అల్ ఖాకా బిన్ అన్తర్ తరచుగా కొండలపై స్టంట్‌లు చేస్తుంటాడు. జూన్ 12వ తేదీన హరధత్ దమత్ అగ్నిపర్వత ముఖద్వారం వద్ద స్టంట్లు చేశాడు. తాడు సాయం లేకుండా అగ్నిపర్వత ముఖద్వారం లోపలి నిలువు గోడలు ఎక్కసాగాడు. ఈ నేపథ్యంలోనే పట్టుతప్పి అగ్నిపర్వతంలోకి పడిపోయాడు. తీవ్రగాయాలతో పాటు అక్కడి వేడి, విషవాయువుల వల్ల అతడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అగ్నిపర్వతం దగ్గరకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
లోపల విపరీతమైన వేడి, విష వాయువులు ఉండటం వల్ల మృతదేహాన్ని వెలికితీయడం కష్టంగా మారింది. రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేక సగం మధ్యనుంచే తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘అతి చేస్తే ఇలానే ఉంటుంది. జనాలకు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది’..‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చే సమస్య ఇదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
కామారెడ్డిలో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్