గాలి నుంచి నీటి తయారీ సాధ్యమేనా? ఏబీఎన్ డైరెక్టర్ భాను ప్రకాష్ స్పెషల్ ఇంటర్వ్యూ
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:30 PM
మార్చి 22న అంతర్జాతీయ నీటి దినోత్సవం. ప్రస్తుతం.. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న నీటి కొరత, వాతావారణ పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు నీటిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయాలపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ప్రముఖులతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: నేడు అంతర్జాతీయ నీటి దినోత్సవం. నీటి సంరక్షణ కోసం ఒక బలమైన నినాదంతో ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమతి(UNO) ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 1993లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ నీటి దినోత్సవంగా ప్రకటించింది. నీటి కొరతను అధిగమించడం, సురక్షితమైన నీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి.. లేబర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యులు బొల్లిముంత సాంబశివరావు, బీహెచ్‌యూ (పర్యావరణ రసాయన శాస్త్ర విభాగం) హెచ్‌ఓడీ కృపారామ్‌లతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు, నీటి ఎద్దడి, వాతావరణ పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు నీటిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయాలపై చర్చించారు.
నీటి కొరత, వాతావరణ పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో వాతావరణంలో సంభవించిన మార్పులపై భానుప్రకాశ్ ప్రత్యేక ప్రశ్నలు అడుగగా.. సాంబశివరావు, కృపారామ్‌లు వివరణ ఇచ్చారు. జీవకోటి మనుగడకు గాలి తర్వాత నీరే అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. మానవ శరీరంలో దాదాపు 60 శాతం నుంచి 70 శాతం వరకు నీరే ఉంటుందని చెప్పుకొచ్చారు. మనం తినే ప్రతి గింజ పండాలన్నా, పాడి పరిశ్రమ వర్ధిల్లాలన్నా నీరు తప్పనిసరని వెల్లడించారు. నీటి కొరత నేరుగా ఆహార సంక్షోభానికి దారితీస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రశ్న: గాలి నుంచి నీటిని తయారుచేయడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి కొరతను తీర్చవచ్చా?
కృపారామ్ సమాధానం: 'గాలి నుంచి నీటిని తయారు చేయడం సాధ్యమైనప్పటికీ ఈ అంశంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. అయితే, మనదగ్గర తగినన్ని నీటి వనరులు ఉన్నాయి. వాటిని తగిన విధంగా వాడుకోవడం ముఖ్యం. నాలుగు నెలల వర్షాకాలంలో గ్రౌండ్ వాటర్ అభివృద్ధి చేసుకోవాల్సిన చర్యల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అయితే, గాలి నుంచి నీటిని తయారు చేసుకోవడం ఒక్కటే మార్గం కాదు. నీటి ఆవిరి ద్వారా నీటిని సేకరిస్తే, ఇది వాతావరణం మీద ప్రతికూల ప్రభావం కూడా చూపే అవకాశం ఉంది.' అని చెప్పారు.
ప్రశ్న: సాగునీరు వ్యాపార వస్తువైపోతున్న తరుణంలో నీటి పొదుపు.. సంరక్షణ ద్వారా కొత్త పద్దతుల్లో అధిక వ్యవసాయ ఉత్పత్తులు సాధించే మార్గాల గురించి చెప్పండి?
సాంబశివరావు సమాధానం: 'మొదటగా వ్యాపారవేత్తలు నీటిని వ్యాపార వస్తువుగా చూడకూడదు. అదే సమయంలో భూగర్భ జలాలను పెంచుకోవడంతోపాటు, నీటి నాణ్యతను పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరోవైపు, ప్రభుత్వం అందిస్తున్న టెక్నాలజీ సహకారాన్ని అందిపుచ్చుకుని రైతులు అధిక ఉత్పత్తి మార్గాలపై దృష్టి పెట్టాలి.'
తెలుగులో ఇంటర్వ్యూ (ఏఐ వెర్షన్) కోసం ఈ వీడియో చూడండి..
ఇంగ్లీష్‌లో ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి(ఏఐ వెర్షన్)
ఇవీ చదవండి:
'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'
AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ