ఇలా బతకడం నా వల్ల కాదు.. ప్రభుత్వ బ్యాంకు జాబ్‌కు మహిళ రాజీనామా
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:14 PM
కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ బ్యాంకు జాబ్‌కు ఓ మహిళ రాజీనామా చేసిన వైనం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంటే లైఫ్‌లో సెటిల్ అయినట్టేనని చాలా మంది భావిస్తారు. దీంతో ఉద్యోగం సాధించిన అభ్యర్థుల ఆనందానికి అంతే ఉండదు. ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్న ఓ మహిళ మాత్రం ఆ తరువాత తన జాబ్‌కు రాజీనామా చేసింది. ఇలా బతకడం నా వల్ల కాదని తేల్చి చెప్పింది. అప్పటికి ఆమె బాండ్ ఇంకా ముగియకపోవడంతో తనే స్వయంగా డబ్బు చెల్లించి మరీ జాబ్‌కు గుడ్‌బై చెప్పింది. ఆ మహిళ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నానని ఆమె తెలిపింది. ‘జాబ్‌లో చేరాక నాకు వాస్తవం నేను అనుకున్న దానికంటే భిన్నంగా ఉందని అర్థమైంది. జీవితం ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళదామనుకున్నా. అంతా రెడీ చేసుకున్నా. విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బ్యాంకులో ఏదో ఆడిట్ ఉందని నా సెలవును క్యాన్సిల్ చేశారు’
‘అప్పటికే నా జీవితం ఒత్తిడితో నిండిపోయింది. తల్లిదండ్రులతో కూడా మాటలు తగ్గించేశాను. కనీసం భర్తతో కూడా మాట కలపలేనంత ఒత్తిడి ఉండేది. చివరకు ఇలా జీవించడం నా వల్ల కాదని నాకు అనిపించింది. అప్పటికి చేతిలో మరో జాబ్ ఆఫర్ కూడా లేదు. బాండ్ పీరియడ్ ఇంకా ముగియకపోవడంతో రాజీనామా కోసం నేనే ఎదురు చెల్లించాల్సి వచ్చింది. తప్పు చేస్తున్నానని కొందరు చెప్పినా, నాకూ అలాగే అనిపించినా నేను మాత్రం రాజీనామా చేసి వచ్చేశాను. ఆ తరువాత ప్రైవేటు రంగంలో జాబ్ దొరికింది. తక్కువ శాలరీకే. అయినా నాకు మాత్రం పశ్చాత్తాపం కలగలేదు. నా నిర్ణయం సరైనదే అని అనిపిస్తోంది’ అని ఆమె పేర్కొంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటో నడిపే యువతి.. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంటే డౌట్! ఆరాతీస్తే..
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక