ఆటో నడిపే యువతి.. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంటే డౌట్! ఆరాతీస్తే..
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:41 PM
ఐటీ జాబ్‌ను కాదనుకుని ఆటో డ్రైవర్‌గా మారిన ఓ యువతి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బెంగళూరులో ఈ ఉదంతం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువత తమకు నచ్చిన తీరులో జీవితాన్ని గడిపేందుకు వెనకాడట్లేదు. కెరీర్‌కు ప్రాధాన్యం ఇచ్చే వారు కూడా అవసరమనుకుంటే క్షణాల్లో కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పేసి ప్రాశాంతతను ఇచ్చే మరో జీవనశైలిని ఎంచుకుంటున్నారు. అలాంటి ఓ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఆటోలో ప్రయాణించిన తన్వీ అనే కంటెంట్ క్రియేటర్ ఆ మహిళా డ్రైవర్ గురించి షేర్ చేశారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్టు కనిపించిన యువతి ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడంతో తన్వికి మొదట డౌట్ వచ్చింది. ఆ తరువాత ఆమెతో మాటకలిపాక తన్వికి మరింత ఆశ్చర్యం కలిగింది. బెంగళూరులో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఆ యువతి జీవితం స్ఫూర్తివంతమని తన్వి పేర్కొంది. యువతి తన తల్లిదండ్రులకు ఒక్కత్తే సంతానమని పేర్కొంది. తండ్రి పోవడంతో ఒంటరైన తల్లికి అండగా ఉండేందుకు ఆమె ఐటీ జాబ్‌కు రాజీనామా చేసిందని పేర్కొంది. బంధువులు స్నేహితులు వద్దని వారించినా తాను ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పానని యువతి పేర్కొంది. జీవితంలో నచ్చినట్టుగా ఉండేందుకు సమాజం అనుమతి కావాలా? అన్న ఆమె ప్రశ్న తనను ఆలోపించజేసిందని తన్వి పేర్కొంది. నచ్చినప్పుడు పని చేసే సౌలభ్యం ఉండటంతోనే తాను ఆటోడ్రైవర్‌గా మారానని యువతి చెప్పినట్టు తన్వి పేర్కొంది.
రాత్రిళ్లు నైట్ షిఫ్టుల కారణంగా తల్లికి దూరంగా ఉండాల్సి వస్తోందని యువతి తన జాబ్‌కు రిజైన్ చేసిందని తన్వి పేర్కొంది. ధైర్యం అంటే సాహసాలు చేయడం కాదని, నచ్చినట్టు నడుచుకునేందుకు కూడా ఒక్కోసారి అసాధారణ సాహసం అవసరం అవుతుందని అభిప్రాయపడింది. యువతిని చూస్తే స్ఫూర్తి, గౌరవం కలిగాయని పేర్కొంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యువతి నిర్ణయాన్ని అనేక మంది ప్రశంసించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..
భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..