ప్రియుడిపై యువతి దారుణం.. రోడ్డుపై అంతా చూస్తుండగానే..
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:11 PM
హర్యానాలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడిపై దారుణానికి ఒడిగట్టింది. రోడ్డుపై అందరూ చూస్తుండగా అతడిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. ప్రియుడి చెంప పగలగొట్టింది..
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ యువతి తన ప్రియుడిపై దారుణానికి ఒడిగట్టింది. రోడ్డుపై అంతా చూస్తుండగా అతడిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. ప్రియుడి చెంప పగలగొట్టింది. జనం అడ్డు చెప్పగా మరింత రెచ్చిపోయింది. ఈ సంఘటన హర్యానాలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుర్‌గావ్‌కు చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఆదివారం ఇద్దరికీ గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ప్రియుడిపై ప్రియురాలు రెచ్చిపోయింది. రోడ్డు మీద అంతా చూస్తుండగా అతడిపై దాడి చేయటం మొదలెట్టింది.
చెంపపై బలంగా కొట్టసాగింది. ఇది చూసిన జనం ఆమెను ‘ఎందుకు కొడుతున్నావ్’ అని ప్రశ్నించారు. దీంతో ఆ యువతి మరింత రెచ్చిపోయింది. పోలీసులను పిలవండి అంటూ ప్రియుడి చెంపపై పలుమార్లు దాడి చేసింది. ప్రియురాలు ఎంత గట్టిగా కొడుతున్నా ప్రియుడు మాత్రం సైలెంట్‌గా దెబ్బలు తింటున్నాడే తప్ప ఎదురు తిరగలేదు. కొట్టొద్దని కూడా చెప్పలేదు. పక్కన ఉన్న జనం కూడా యువతికి భయపడి ఏమీ అనలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీశాడు.
ఆ వీడియోను రమేష్ తివారీ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటివి చూస్తున్నపుడు ప్రేమ, పెళ్లి అంటే భయం వేస్తుంది. ఇలాంటి వాళ్లతో ఉండటం కంటే సింగిల్‌గా ఉండటం మేలు’..‘ఆ యువకుడు చాలా అమాయకుడిగా ఉన్నాడు. పాపం.. ప్రియురాలి చేతిలో దెబ్బలు తింటున్నాడు’..‘ఆ యువతిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చాడీలు చెబితే జరిమానా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా..
మీ ఆస్తులు ప్రకటిస్తారా... స్టాలిన్‌కు విజయ్ సవాల్